నేడు ఏపీ బంద్

నేడు ఏపీ బంద్

08-02-2018

నేడు ఏపీ బంద్

నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌, నిరసనలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, వామపక్షాల బంద్‌ పిలుపునకు విపక్ష వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇక అధికార తెలుగు దేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలియచేయాలని పిలుపునిచ్చింది. ఇందుకు జనసేన కూడా మద్దతు పలికింది. ఏపీ ప్రజల ఆగ్రహం, అభిప్రాయాలు ఢిల్లీకి తెలియాలనే ఉద్దేశంతో ఈ బంద్‌కు టీడీపీ అనధికారికంగా మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. నేరుగా బంద్‌కు మద్దతివ్వకుండా, ప్రతిచోటా నిరసన ప్రదర్శనలు జరపాలని నిర్ణయించింది. ముందు జాగ్రత్తగా విద్యాశాఖ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర బంద్‌కు సంపూర్‌న మద్దతిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.