రాష్ట్రంలో కాదు ఢిల్లీలో పోరాడాలి

రాష్ట్రంలో కాదు ఢిల్లీలో పోరాడాలి

07-02-2018

రాష్ట్రంలో కాదు ఢిల్లీలో  పోరాడాలి

రేపటి సీపీఐ రాష్ట్రబంద్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రేపు దుబాయ్‌ పర్యటనకు వెళ్తున్నానని, బంద్‌ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఏపీకి రావాల్సిన కేటాయింపులపై మన రాష్ట్రంలో కాదు ఢిల్లీలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఏపీకి న్యాయం జరగాలని ఎంపీలు పోరాడుతున్నారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా వామపక్షాలు, ఇతర పార్టీలు రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.