మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత

మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత

07-02-2018

మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టిన ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గ అభివృద్ధి సహా జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన అందరికీ సుపరిచితులు, విపక్షాలపై ధ్వజమెత్తడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన మరణంతో తెలుగుదేశం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.