కడప-విజయవాడ మధ్య ట్రూజెట్ సేవలు
APEDB
Ramakrishna

కడప-విజయవాడ మధ్య ట్రూజెట్ సేవలు

07-02-2018

కడప-విజయవాడ మధ్య ట్రూజెట్ సేవలు

ట్రూజెట్‌ బ్రాండ్‌సేమ్‌తో విమానయాన సేవలందిస్తోన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ వచ్చే నెల 1 నుంచి కడప-విజయవాడ మధ్య విమాన సర్వీసును నడపనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్‌ పథకంలో భాగంగా కడప నుంచి విమాన సర్వీసులు నడుపుతున్న ఏకైక సంస్థ ట్రూజెట్‌. ఇప్పటికే కడప నుంచి హైదరాబాద్‌, చెన్నైలకు విమానయాన సేవలందిస్తోంది. మొత్తం ఐదు విమానాలతో 13 నగరాలకు సంస్థ విమానాలు నడుపుతోంది.