అమరావతిలో సీఎస్ఐఆర్ కేంద్రం!
APEDB
Ramakrishna

అమరావతిలో సీఎస్ఐఆర్ కేంద్రం!

07-02-2018

అమరావతిలో సీఎస్ఐఆర్ కేంద్రం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలో పారిశ్రామిక, శాస్త్రీయ పరిశోధనకు ఉపకరించే ముఖ్య కేంద్రం ఒకటి ఏర్పాటు కానుంది. దేశంలో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థగా ఉన్న సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌) ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాలను, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సెంటర్‌ ఫర్‌ స్కేలింగ్‌ ఆప్‌ అండ్‌ డిమాన్‌స్ట్రేషన్‌ ఆఫ్‌ రెలవెంట్‌ సీఎస్‌ఐఆర్‌ టెక్నాలజీస్‌ పేరుతో నెలకొల్పుతున్న ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ గిష్‌ సాహ్ని వెల్లడించారు. సాహ్ని బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది.