ఏపీ నుంచి విమాన సర్వీసులు

ఏపీ నుంచి విమాన సర్వీసులు

07-02-2018

ఏపీ నుంచి విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును థాయ్‌లాండ్‌ కాన్సుల్‌ జనరల్‌ కాంగ్‌ కనీత్‌ రక్చోరియన్‌, ప్రతినిధుల బృందం కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ లేదా విజయవాడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, విజయవాడ నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.