పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళన

పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళన

06-02-2018

పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళన

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ఆదుకోవాలని, బడ్జెట్‌ కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ తెలుగుదేశం, వైకాపా ఎంపీలు పార్లమెంటు వేదికగా ఆందోళన ఉధృతం చేశారు. ఈ రోజు లోక్‌సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం, వైకాపా ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి ఆందోళన చెపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. మిత్రధర్మాన్ని కాపాడాలంటూ తెలుగుదేశం ఎంపీలు నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళనలతో సభ 10 నిమిషాలు వాయిదా పడింది. అంతకుముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ డెమెక్రసీ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.