ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం : చంద్రబాబు
APEDB
Ramakrishna

ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం : చంద్రబాబు

06-02-2018

ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం : చంద్రబాబు

పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం జరగాలని అన్నారు. అప్పుడున్న పార్టీలే ఇప్పుడు పార్లమెంటులో ఉన్నాయని, ఏపీకి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని అన్నారు. మూడున్నరేళ్లలో ఏపీకి చేసింది కొంతే, చేయాల్సింది చాలా ఉందని, ప్రజలు సంతృప్తి చెందేలా చూడాల్సింది కేంద్రమే అని అన్నారు.

చేస్తాం, చూస్తామంటే సంతృప్తి కలుగదు, ఆ స్థాయి దాటిపోయిందని, హామీలు కాదు, చేతలు కావాలి, సృష్టమైన కార్యాచరణ కావాలని అన్నారు. సభ్యులందరూ సభకు హాజరుకావాలని, నిరసనల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో ప్రతిబింబించాలని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమని, రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలని ఎంపీలకు సూచించారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని అన్నారు. హక్కుగా ప్రజల తరపున అడుగుతున్నామని, డిమాండ్‌ను వినిపిస్తున్నామని, మిత్రపక్ష ధర్మంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కేంద్రం దృష్టికి తీసుకెళ్దామని అన్నారు. ప్రజల అసంతృప్తిని తెలియజేసే అన్నిమార్గాలు అనుసరించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడండని ఎంపీలతో చంద్రబాబు పేర్కొన్నారు.