ప్రధాని మోదీతో సుజనాచౌదరి భేటీ

ప్రధాని మోదీతో సుజనాచౌదరి భేటీ

06-02-2018

ప్రధాని మోదీతో సుజనాచౌదరి భేటీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో కేంద్రమంత్రి, టిడిపి నేత రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి భేటీ అయ్యారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై మోదీకి సూజనాచౌదరి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని, విభజన హామీలను నెరవేర్చాలని ఆయన మోడీని కోరారు. భేటీ అనంతరం ప్రధానితో చర్చించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుజనాచౌదరి ఫోన్‌లో తెలిపారు.బిజెపితో పొత్తు విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని మోడీ తనతో చెప్పినట్టు సుజనా చౌదరి తెలిపారు.