నారాయణ ఫస్ట్... లోకేష్ సెకండ్

నారాయణ ఫస్ట్... లోకేష్ సెకండ్

06-02-2018

నారాయణ ఫస్ట్... లోకేష్ సెకండ్

మంత్రుల పనితీరు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాంకులను ప్రకటించారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన, ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంలో ముందున్నారంటూ పలువురు మంత్రులకు కితాబిచ్చారు. తాను ఎన్నో అంశాలను పరిశీలించి ఈ ర్యాంకులను ఇస్తున్నానని చెప్పిన ఆయన తొలి స్థానంలో నారాయణ, రెండో స్థానంలో నారా లోకేష్‌ ఉన్నారని తెలిపారు. అలాగే, మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు వున్నారని అన్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో మంత్రులు ఆదినారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్‌ ఉన్నట్లు తెలిపారు. మంత్రులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టిని పెట్టాలని సూచించిన చంద్రబాబు, పనితీరు బాగాలేకుంటే పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమని హెచ్చరించారు.