ఈ నెల 25 నుంచి శ్రీవారికి తెప్పోత్సవాలు

ఈ నెల 25 నుంచి శ్రీవారికి తెప్పోత్సవాలు

06-02-2018

ఈ నెల 25 నుంచి శ్రీవారికి తెప్పోత్సవాలు

తిరుమల శ్రీవారికి తెప్పోత్సవాలు ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఉత్సవాల్లో భాగంగా నిత్యం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో ఉత్సవమూర్తులు విహరించనున్నారు. ఈ వేడుకల నేపథ్యంలో శ్రీవారికి ఈ నెల 25, 26న వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ,  27, 28, మార్చి 1 తేదీల్లో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.