వియత్నాంలో మంత్రి సోమిరెడ్డి పర్యటన

వియత్నాంలో మంత్రి సోమిరెడ్డి పర్యటన

06-02-2018

వియత్నాంలో మంత్రి సోమిరెడ్డి పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వియత్నాంలో రెండోరోజు పర్యటన కొనసాగించింది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డా||జానయ్యతో కలిసి థాయ్‌ ప్రోపిన్యూలోని థాయ్‌ బిన్‌ సంస్థను సందర్శించింది. విత్తన సంస్థ చైర్మన్‌ ట్రాన్‌మాన్‌ బావో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల ఉత్పత్తి, చేస్తున్న పరిశోధలు, విడుదల చేసిన వంగడాలు, విత్తన శుద్ధి తదితరాల గురించి వివరించారు. బృంద సభ్యులు అతి పెద్ద రైస్‌ మిల్లును సందర్శించారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు డిజిటల్‌ సాయిల్‌ మ్యాపింగ్‌, మట్టి ఆరోగ్య కార్డుల తయారీలో అందజేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు.