పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీల ఆందోళన

పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీల ఆందోళన

05-02-2018

పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీల ఆందోళన

తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ వారు నినాదాలు ఇచ్చారు. విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చారు. 193వ నిబంధన కింద టీడీపీ ఎంపీలు నోటీస్‌ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ వారు నోటీస్‌ ఇచ్చారు. అనంతరం పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగి ప్లేకార్డులు ప్రదర్శించారు.