సీఎం చంద్రబాబుకు దేవినేని అభినందనలు

సీఎం చంద్రబాబుకు దేవినేని అభినందనలు

05-02-2018

సీఎం చంద్రబాబుకు దేవినేని అభినందనలు

పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిపై 50వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణకు ముఖ్యమంత్రి అహోరాత్రులు పనిచేస్తున్నారన్నారు. పోలవరం సహా 28 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేసి ఏపీని కరువు రహిత రాష్ట్రం చేయాలనేది ముఖ్యమంత్రి సంకల్పమని పేర్కొన్నారు.