సీఎం చంద్రబాబుకు రాజ్ నాథ్ ఫోన్

సీఎం చంద్రబాబుకు రాజ్ నాథ్ ఫోన్

05-02-2018

సీఎం చంద్రబాబుకు రాజ్ నాథ్ ఫోన్

తెలుగుదేశం పార్టీ భేటీ జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌ చేశారు. కేంద్రానికి మద్దతుపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకోబోతోందని కొన్ని ప్రసార సాధనాల్లో వార్తలు రావడంతో ఆయన ఫోన్‌ చేసినట్లు  సమాచారం. తొందరపడవద్దని ఆయన చంద్రబాబును కోరారని తెలిసింది. తొందరపడే ఉద్దేశం తనకు లేదని, కానీ నాలుగేళ్లు ఎదురుచూసినా ఏ ఫలితం కనిపించకపోవడం  వల్లే బాధపడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి ఆయనతో అన్నారు.