ఘనంగా దక్షిణ షిరిడీ 12వ వార్షికోత్సవం

ఘనంగా దక్షిణ షిరిడీ 12వ వార్షికోత్సవం

04-02-2018

ఘనంగా దక్షిణ షిరిడీ 12వ వార్షికోత్సవం

గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడిలో ఉన్న దక్షిణ షిరిడి గా పేరుగాంచిన భగవాన్‌ శ్రీ సత్య షిరిడి సాయిబాబా దేవాలయం 12 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ  సందర్భంగా విచ్చేసిన భక్తులకు, రాజకీయ ప్రముఖులకు, సినీ కళాకారులకు, ఉన్నతాధికారులకు ఆలయకమిటీ చెర్మన్‌, గుంటూరు మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీ పాతూరి నాగభూషణం శుభాభినందనలు తెలియజేస్తూ సాయిబాబా వారి అశీసులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా దేవాలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి బాబా అనుగ్రహాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎం.మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరి దినేష్‌ కుమార్‌, మంత్రి వర్యులు పుల్లారావు, గంటా శ్రీనివాస్‌, నారాయణ, నక్క ఆనంద్‌ బాబు. పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర, స్వామిజి విశ్వంజీ, షిరిడి ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌  సచిన్‌ తాంబే గారు. సినీ కళాకారులు, జబర్దస్త్‌ టీం మెంబర్స్‌ తదితరులు దేవాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.

Click here for Event Gallery