ఆర్యవైశ్యులతో వైయస్ జగన్ ఆత్మీయ సమావేశం

ఆర్యవైశ్యులతో వైయస్ జగన్ ఆత్మీయ సమావేశం

04-02-2018

ఆర్యవైశ్యులతో వైయస్ జగన్ ఆత్మీయ సమావేశం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దేవరపాలెంలో ఆర్యవైశ్యులతో శ్రీ వైయస్ జగన్ ఆత్మీయ సమావేశం. ఆర్యవైశ్య సమ్మేళనంలో పాల్గొనటం ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించారు. నవంబర్ 1న పొట్టిశ్రీరాములు గౌరవార్థం రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తాం. పేదరికానికి కులం, మతం తేడా లేదు. ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. జీఎస్టీ దాడులు పెరుగుతున్నాయని ఆర్యవైశ్యులు చెబుతున్నారు. 

నెల్లూరు జిల్లా కాదు.. నాన్నగారి హయాంలోనే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు. జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది కాదు.. కేంద్రం పరిధిలోనిది. మీరు చెప్పేది వారు వినే రోజు వస్తుందన్న శ్రీ వైయస్ జగన్.

యశష్విని అనే అమ్మాయి మాట్లాడుతూ.. పదో తరగతి వరకు ఓసీలకు ఉచితంగా చదువుకునే సౌకర్యం కల్పించాలని కోరగా.. నిన్ను బడికి పంపిస్తే.. మీ అమ్మకు రూ.15వేలు డబ్బు ఇవ్వటమే కాకుండా.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదువులు కూడా చదివేందుకు తోడ్పాటు అందిస్తామని శ్రీ జగన్ గారు హామీ ఇచ్చారు. 

మనందరి ప్రభుత్వం వచ్చాక.. ఆర్యవైశ్యులకు పావలా వడ్డీకి రుణాలు వచ్చేలా చేస్తాం

-- చట్టసభల్లో రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తి తూట్లు పొడుస్తున్నారు ఇలాంటి పరిస్థితిలోకి ఆంధ్రరాష్ట్రాన్ని చంద్రబాబు తీసుకువెళ్లారు. మీరు చెబుతున్నది విని కాస్తైనా బుద్ధి తెచ్చుకోవాలి. అప్పుడు వ్యవస్థైనా బాగుపడుతుంది. ఎవరైనా లంచం తీసుకుంటూ లేకపోతే ఇస్తూ దొరికితే.. ఉద్యోగం పోతుంది. జైల్లో పెడతారు. మన ఖర్మ ఏంటంటే.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోతే..ఈ మనిషి రాజీనామా చేయరు. ఈ మనిషి రాజీనామా చేయరు. ఈ మనిషిని డిస్ క్వాలిఫై చేయరు. ఏ మనిషిని ఎవరూ జైల్లో పెట్టరు. అంత దారుణంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ..ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మీరు చెప్పే మాటలతో అయినా పాలకుల్లో మార్పు రావాలి.

- గూడూరులో అరగంట మాత్రమే నీరు ఇస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే 24 గంటలు నీరు వచ్చేలా చేయాలని ఓ మహిళ కోరగా.. మీరు చెప్పింది  ఖచ్చితంగా టార్గెట్ గా పెట్టుకుంటామని శ్రీ జగన్ గారు హామీ ఇచ్చారు.

- ఆర్యవైశ్యులకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన శ్రీ వైయస్ జగన్.

- చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసింది. పేదవాళ్లకు మంచి జరగాలన్నదే నా తాపత్రయం. పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు.

- చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి అడగటం మానేశారు.ప్రత్యేక హోదాను సాధిస్తామనే ధ)క్పధంతోనే పోరాడుతున్నాం.ఈ రోజు కాకపోతే రేపు ప్రత్యేక హోదా సాధిస్తాం: శ్రీ వైయస్ జగన్

రాజన్న క్యాంటీన్ లను తీసుకొస్తాం: శ్రీ వైయస్ జగన్

Click here for Photogallery