ఈనెల 8న దుబాయ్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఈనెల 8న దుబాయ్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

03-02-2018

ఈనెల 8న దుబాయ్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 8న దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కాగా ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా జనవరి 22వ తేదీ నుంచి చంద్రబాబు దావోస్‌లో నాలుగు రోజులపాటు పర్యటించిన విషయం తెలిసిందే. 25 ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు, 5 ముఖ్యమైన బేటీలు, సీఈవో రౌండ్‌ టేబుల్‌ మీటింగ్స్‌, గ్లోబల్‌ సీఈవోలతో ముఖాముఖి చర్చల్లో ప్రధాన వక్తగా కొన్ని సెషన్స్‌లో చంద్రబాబు ప్రసంగించారు. మొత్తం 3 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఫ్రాన్‌ హోఫర్‌- ఏపీఈడీడీ మధ్య ఒక అవగాహన ఒప్పందం, హిటాచీతో మరో ఎంవోయూ, జ్యురిచ్‌తో సిస్టర్‌ సిటీ ఒప్పందాలు చంద్రబాబు సమక్షంలో జరిగాయి.

అలాగే మంత్రి నారా లోకేష్ కూడా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలను కలుస్తూ బిజిబిజీగా ఉన్నారు.