గురువు లేకుంటే గూగుల్ కూడా పనిచేయదు

గురువు లేకుంటే గూగుల్ కూడా పనిచేయదు

03-02-2018

గురువు లేకుంటే  గూగుల్  కూడా పనిచేయదు

చదువు చెప్పే గురువును గౌరవించాలని, గురువు లేకుంటే  గూగుల్‌ కూడా పనిచేయదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరులోని జేకేసీ కాలేజీ 50 ఏళ్ల ఉత్సవాల కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషను మర్చిపోవద్దని, మాతృభాష కళ్లలాంటిది, పరాయిభాష కళ్లద్ధాల్లాంటిదని అన్నారు. దేశం, సమాజం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. దేశం ముందుకు వెళ్లాలంటే ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించాలని, అంతా ప్రభుత్వాలు చూసుకుంటాయని అనుకోకూడదని అన్నారు. అవిద్య, అవినీతి, అంతరాలు పోవలని అన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషమని, ఏడాది కాదు 15 ఏళ్ల పాటు వ్వవసాయానికి పెద్దపీట వేయాలన్నారు.  వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లలాంటివని, గ్రామాలకు రోడ్ల సవతి, ఆస్పత్రి, పాఠశాల తప్పనిసరని అన్నారు. విద్య అన్నింటికంటే ముఖ్యమైనదని, విద్యా ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు.