పదిరోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుంది

పదిరోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుంది

03-02-2018

పదిరోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుంది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తమ భ్రమలు పటాపంచలయ్యాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌పై ప్రతి సీమాంధ్రుడి గుండె రగలిపోతోందని అన్నారు. కేంద్రం ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, ఇంకా బీజేపీని పట్టుకుని వేలాడటం సరికాదని అన్నారు. తెగదెంపులపై పదిరోజుల్లో ఏదోఒకటి తేలిపోతుందని, ఓపిక నశిస్తే తెలుగువారు తిరగబడతారని పేర్కొన్నారు.