మంత్రి సోమిరెడ్డి విదేశీ పర్యటన

మంత్రి సోమిరెడ్డి విదేశీ పర్యటన

03-02-2018

మంత్రి సోమిరెడ్డి విదేశీ పర్యటన

వరి సాగులో ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తన బృందంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వీరు ఈ నెల 3 నుంచి 10 వరకు వియత్నాం, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌ల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాల్లో వరి క్షేత్రాలను పరిశీలించడంతో పాటు వరిసాగులో యాంత్రీకరణ, పంటల బీమా విధానాలను ఈ బృందం అధ్యయనం చేయనుంది. మంత్రి వెంట వ్యవసాయశాఖ మంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ బీ రాజశేఖర్‌, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ వల్లభనేని దామోదరనాయుడు, రీసెర్చ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీ నాయుడు, సాయిల్‌ సైంటిస్ట్‌ ప్రసూనరాణి, ఇర్రి కన్సల్టెంట్‌ జానయ్య ఉన్నారు.