రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

03-01-2018

రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

రాయలసీమ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన జన్మభూమి- మా వూరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ సీమ ప్రాంతంలో నీరు చూడటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పట్టిసీమ నుంచి తీరు తీసుకొచ్చాం. రాయలసీమను ఉద్వాన హబ్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాం. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు  చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాయలసీమలో అభివృద్ధి జరగాలంటే నాకు సహకరించండి.

పులివెందులలో తెలుగుదేశం పార్టీని గెలిపించకపోయినా అభివృద్ధికి నిధులు ఇస్తూనే ఉన్నాం. ఇక్కడ ముఠా కక్షల వల్ల కంపెనీలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. రూ.149లకే ఇంటర్నెట్‌, కేబుల్‌, టెలిఫోన్‌ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. మూడున్నరేళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆనందంగా పనిచేస్తే విసుగు అనేది రాదని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రజలెవరైనా 1100 నంబరుకు ఫోన్‌ చేస్తే వారి సమస్యలు పరిష్కరిస్నున్నాం. ప్రతి కుటుంబం నెలకు రూ.10వేల ఆదాయం సాధించే విధంగా శ్రద్ధ పెట్టాం అన్నారు.

Click here for Event Gallery