తెలుగుభాషను కాపాడుకోవడం మన బాధ్యత

తెలుగుభాషను కాపాడుకోవడం మన బాధ్యత

01-01-2018

తెలుగుభాషను కాపాడుకోవడం మన బాధ్యత

తెలుగుభాషను కాపాడుకోవడం మన బాధ్యతని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పుస్తక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఏపీతో నాంది పలికామమని అన్నారు.  2018ని తెలుగుభాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇంటర్‌నెట్‌ వల్ల రాతకు అవకాశం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. భాషా పరిరక్షణలో పుస్తకాలదే ప్రముఖపాత్ర ఉందని పేర్కొన్నారు. ఉపాధి కోసం ఆంగ్ల నేర్చుకున్నప్పటికీ, భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని అన్నారు. విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, పూర్వవైభవం తెచ్చేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు.