సమాజాన్ని నడిపించేది అక్షరమే : ఉపరాష్ట్రపతి
Ramakrishna

సమాజాన్ని నడిపించేది అక్షరమే : ఉపరాష్ట్రపతి

01-01-2018

సమాజాన్ని నడిపించేది అక్షరమే : ఉపరాష్ట్రపతి

సమాజాన్ని నడిపించేది అక్షరమే అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పుస్తక మహోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు మనకి మంచి స్నేహితులని అన్నారు. అక్షరానికి నాశనం లేదని, అక్షరంతోనే భాష ప్రారంభమవుతుందన్నారు. జీవితంలో పుస్తకానికి మించిన ఆప్తుడు మరొకరు ఉండరని అన్నారు. పుస్తక మహోత్సవాన్ని భావితరాలకు తెలియజెపాల్సిన అవసరం ఉందన్నారు. అక్షరం నాశనం లేనిదని, అక్షరంతోనే భాష ప్రారంభమవుతుందన్నారు. పుస్తకాల్లో శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం ఇమిడి ఉందన్నారు. పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని విశ్లేషించాలని సూచించారు. మనం చదివే పుస్తకాలను బట్టే మన నడవడిక ఉంటుందన్నారు. 2018ని తెలుగుభాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించడం సంతోషం. పాలకులు ఆదరించకుండా ఏభాషా మనుగడ సాధించదు అని వెంకయ్య సృష్టం చేశారు.