కొత్త శకానికి నాంది పలకాలి

కొత్త శకానికి నాంది పలకాలి

01-01-2018

కొత్త శకానికి నాంది పలకాలి

దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలి. నూతన సంవత్సరంలో మీరు చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. కొత్త ఏడాదిలో ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలతో ఆనందాలు విరజిల్లాలి. తెలుగు ప్రజలు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలన్నారు.