ట్రాన్స్‌జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ట్రాన్స్‌జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

30-12-2017

ట్రాన్స్‌జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ట్రాన్స్‌జెండర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. వారికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించింది. అలాగే ట్రాన్స్‌జెండర్‌ పాలసీని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 43,769 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే వారిలో 18 ఏళ్ల పైబడిన వారికి నెలకు రూ.1500 పెన్షన్‌ మంజూరు చేయాలని నిర్ణయించింది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదని, విద్యా, ఉద్యోగాల్లో వివక్ష చూపరాదని ప్రభుత్వం ఆదేశించింది.