టీడీపీలో చేరుతున్నాను : బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

టీడీపీలో చేరుతున్నాను : బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

29-12-2017

టీడీపీలో చేరుతున్నాను : బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరుతానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు, సీట్ల విషయంపై చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. వైసీపీ పోటీ చేయాల్సిన చోట చేయకుండా పోటీ అవసరం లేని చోట జగన్‌  పోటీ పెడతారని విమర్శించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును నిన్న  బైరెడ్డి కలిశారు. రాష్ట్ర విభజన ఉద్యమాల నేపథ్యంలో ప్రత్యేక రాయలసీమ సాధన కోసం బైరెడ్డి రాజ శేఖర్‌ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.