పూర్తయితే అమరావతి మహాద్భుతం : రాష్ట్రపతి

పూర్తయితే అమరావతి మహాద్భుతం : రాష్ట్రపతి

29-12-2017

పూర్తయితే అమరావతి మహాద్భుతం : రాష్ట్రపతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ప్రభుత్వ సాంకేతిక కేంద్రం ఆసియాలోనే పెద్దదని విన్నానని, ఆన్‌లైన్‌లో సచివాలయం పాత్రను అది పోషిస్తోందని, అనేక సర్వీసులను ఆన్‌లైన్‌లో దీని ద్వారా అందిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. అమరావతి నిర్మాణ ప్రణాళికలను కూడా మెచ్చుకున్నారు. మొత్తం నిర్మాణం పూర్తయితే అమరావతి మొత్తం దేశంలోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు కలిగిన నగరం అవుతుంది. దేశంలో అది టెక్నోపొలిస్‌గా నిలుస్తుంది. ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబులో అత్యుత్తమ అభివృద్ధి సాధించడానికి పడే తపననే చూస్తున్నారు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ, ప్రతి కార్యాలయానికీ ఇంటర్‌నెట్‌తో అనుసంధానం తప్పనిసరి అవుతున్న నేటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భవిష్యత్‌ను అర్థం చేసుకుని వ్యవహరిస్తోందని ప్రశంసించారు.