పండుగ వాతావరణంలో జన్మభూమి- మా ఊరు

పండుగ వాతావరణంలో జన్మభూమి- మా ఊరు

29-12-2017

పండుగ వాతావరణంలో జన్మభూమి- మా ఊరు

జనవరి 2వ తేదీ నుంచి జరిగే జన్మభూమి పది రోజులు పండుగ వాతావరణం నెలకొనాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జన్మభూమిలో ఒక్కో రోజు ఒక్కో క్రీడా పోటీలను గ్రామస్థాయిలో నిర్వహించాలన్నారు.  గ్రామీణ క్రీడలను ప్రధానంగా ప్రోత్సహించాలని అన్నారు. అలాగే క్రీడా పోటీల్లో విజేతలకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలన్నారు. అలాగే ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఏర్పాటు చేసి జన్మభూమి మా ఊరును విజయవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామానికి ఒక కోఆర్డినేటర్‌ చొప్పున నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.