ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం

ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం

29-12-2017

ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం

మూడు రోజులపాటు జరగనున్న విశాఖ ఉత్సవ్‌ను శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద రావు ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, నమూనా ఆలయాల కాంప్లెక్స్‌, టియు-142 విమాన మ్యూజియం కోడెల ప్రారంభించారు. అలాగే బీచ్‌ రోడ్డులో నిర్వహించిన భారీ కార్నివాల్‌ను కోడెలతో పాటు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి ప్రారంభించారు. వేల సంఖ్యలో పిల్లలు, పెద్దలు ర్యాలీగా ఆర్‌కేబీచ్‌లోని ప్రధాన వేదిక వద్దకు తరలివచ్చారు. ప్రధాన వేదిక వద్ద జరిగిన సభలో స్పీకర్‌ కోడెల మాట్లాడుతూ విశాఖ రాష్ట్రానికే తలమానికమని అన్నారు. హుదూద్‌ విశాఖను ఎంతో నష్టపరిచిందో, అంతకు రెట్టింపు అభివృద్ధి జరిగిందని దీనికి  విశాఖ వాసులు ఆత్మస్థైర్యమే కారణమని అన్నారు.