ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై కసరత్తు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై కసరత్తు

29-12-2017

ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై కసరత్తు

ఎలక్ట్రిక్ వాహనాల తయారీని రాష్ట్రంలో ప్రొత్సహించేందుకు వీలుగా ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెలగపూడి సచివాలయంలో ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్‌పోర్టు, పరిశ్రమలు, ఆర్టీసీ అధికారులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 నుంచి మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉండే ఈ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాల తయారీ వరకూ పూర్తి స్థాయి వాతావరణం రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా ఈ పాలసీని రూపకల్పన చేయాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రొత్సహించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్‌ల ఏర్పాటు, చార్జింగ్ వ్యవస్థ ఏర్పాటు వంటివి ప్రతిపాదించారు. వచ్చే మూడేళ్లలో 30 వేల కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనాల తయారీ, చార్జింగ్, పరిశోధనలకు ఊతం ఇచ్చేలా పాలసీలో రాయితీలు కల్పించాలన్నారు.