ఈ నెల 30న విజయవాడకు ఉపరాష్ట్రపతి

ఈ నెల 30న విజయవాడకు ఉపరాష్ట్రపతి

28-12-2017

ఈ నెల 30న విజయవాడకు ఉపరాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ నెల 30న రాత్రి 9 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు 31న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉదయం 9.15 నుంచి 9.45 వరకు సీనియర్‌ జర్నలిస్టులతో జరిగే అల్పాహార విందుకు హాజరవుతారు. 10 గంటల నుంచి 11 వరకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేయడంతో పాటు ఎలీప్‌ సంస్థకు చెందిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చిన్న పిల్లల వినికిడి సంబంధిత సమస్యలకు వైద్యం అందించే ఉచిత శిబిరాన్ని ప్రారంభిస్తారు. రాత్రి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లోనే బస చేసి మరుసటి రోజు జనవరి 1న ఉదయం 11 గంటలకు విజయవాడ స్వరాజ్యమైదానంలో 29వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11:15 నుంచి 12:15 వరకూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పుస్తక మహోత్సవ సంఘం నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్తారు.