ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాలిఫోర్నియాలోని బర్కిలీ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ప్రొఫెసర్ సోలమన్ డార్విన్ బృందం వెలగపూడి సచివాలయంలో కలిసింది. రాష్ట్రంలో స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టుపై ఈ బృందం వివరించింది. విలేజ్ డిజిటల్ మాల్, ఆగ్రో ప్లాట్ ఫార్మ్, హెల్త్ కేర్ ప్లాట్‌ఫారమ్, ఇన్నోవేషన్ గేట్వేలను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం రూపొందించడం జరిగింది. ఈ నాలుగు అంశాలపై కూడా ముఖ్యమంత్రికి బృందం సభ్యులు వివరించారు.