వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు

28-12-2017

వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబైంది. గురువారం అర్థరాత్రి తర్వాత వైకుంఠద్వార దర్శనం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటలకే ఏకాంత సేవ నిర్వహిస్తారు. సరిగ్గా 12 గంటలకు మళ్లీ ఆలయం తెరిచి తిరుప్పావై ప్రవచిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము 5:30 గంటల నుంచి వీఐపీలను దర్శనాలకు అనుమతి ఇస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభించాలని యంత్రాంగం భావిస్తోంది. ఏకాదశి రోజున ఉదయం 9-11 గంటల మధ్య స్వర్ణరథోత్సవం ఉంటుంది. ద్వాదశి రోజున చక్రస్నానం నిర్వహిస్తారు. కాగా, జీఎన్సీ టోల్‌గేట్‌ నుంచి ఆలయం వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.