అమరావతిలో ఐటీ పార్కు

అమరావతిలో ఐటీ పార్కు

28-12-2017

అమరావతిలో ఐటీ పార్కు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని శాఖమూరు, ఐనవోలు గ్రామాల పరిధిలో 198.52 ఎకరాల్లో ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నారు. దీనిలో 56.10 ఎకరాల్లో  ఐటీ సెజ్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఐటీ సెజ్‌ ఐనవోలు గ్రామ పరిధిలోకి వస్తుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పనుల పురోగతిపై సమీక్షించారు. ఐటీ పార్కు సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణంలో ముందు చూపుతో వ్యవహరించాలని, ఏ విషయాన్నీ విస్మరించరాదని, భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి సృష్టం చేశారు.