మూడేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

మూడేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

27-12-2017

మూడేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) వచ్చే మూడేళ్లలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా లక్ష మందికి నైపుణ్య శిక్షణ కల్పించడానికి సిద్ధమైంది. ఇందుకోసం ఫ్రాన్స్‌కు చెందిన డాస్సాల్ట్ సిస్టమ్స్‌తో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో డాస్సాల్ట్ సిస్టమ్స్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్యామ్‌సన్ ఖాన్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో కోగంటి సాంబశివరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని డాస్సాల్ట్ సిస్టమ్స్ ఎండీ శ్యామ్సన్ అన్నారు. ఆధునిక సాంకేతికతను రాష్ట్ర విద్యార్థులకు అందించడంలో తామూ భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. డాస్సాల్ట్ సిస్టమ్స్ సంస్థ ద్వారా 85 కోర్సుల్లో యువతకు ప్రపంచస్థాయి శిక్షణ అందుబాటులో కి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.