రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్‌ నెట్‌ సేవల విస్తరణ: మంత్రి లోకేశ్‌

రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్‌ నెట్‌ సేవల విస్తరణ: మంత్రి లోకేశ్‌

27-12-2017

రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్‌ నెట్‌ సేవల విస్తరణ: మంత్రి లోకేశ్‌

అమరావతి:రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్‌ నెట్‌ సేవలను విస్తరిస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. సచివాలయంలో ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడారు. 3లక్షల 75వేల విద్యుత్‌ స్తంభాల ద్వారా ఫైబర్‌ నెట్‌ విస్తరిస్తున్నామన్నారు. కేవలం 9 నెలల్లోనే 24వేల కిలోమీటర్ల మేర పూర్తి చేయడం రికార్డు అని పేర్కొన్నారు. రూ.149కే ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందిస్తామన్నారు. ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి రూ.149కే కేబుల్‌, నెట్‌, ఫోన్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

Click here for Event Gallery