ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి

ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి

27-12-2017

ఫైబర్‌ నెట్‌  ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి

డిజిటల్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ నూతన శకానికి నాంది పలికింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అమరావతిలో ప్రారంభించారు. ఇంటింటికీ నాణ్యమైన సేవలు అందించాలన్న లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేవలం రూ.149లకే ఒకే కనెక్షన్‌తో మూడు రకాల సేవలు (అంతర్జాలం, టీవీ, ఫోన్‌) అందించనుంది. ఫైబర్‌ నెట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click here for Event Gallery