ఆర్థిక అసమానతలపై చర్చ జరగాలి : రాష్ట్రపతి

ఆర్థిక అసమానతలపై చర్చ జరగాలి : రాష్ట్రపతి

27-12-2017

ఆర్థిక అసమానతలపై చర్చ జరగాలి : రాష్ట్రపతి

సమాజంలో ఆర్థిక అసమానతలపై చర్చ జరగాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. గుంటూరులోని ఏఎన్‌యూలో ఏర్పాటు చేసిన భారత ఆర్థిక సంఘం (ఐఈఏ) సదస్సును రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్థశాస్త్రం నదీ ప్రవాహం లాంటిదని, ఎన్నో శాస్త్రాలను తనలో ఇముడ్చుకుందని అన్నారు. ఐఈఏ దేశంలోనే అత్యుత్తమ వృత్తి నిపుణుల బృందంలో ఒకటిగా ఉంది. భారత విధాన నిర్ణయాల్లో ఎంతోమంది నిపుణులు పాలుపంచుకున్నారు. కీలక ఆర్థిక సంస్కరణల్లో ఐఈఏ సభ్యులో భాగస్వామ్యం వహిచారు. ఇలాంటి సదస్సులు ఆర్థిక ప్రగతికి ఎంతో సహకారం అందిస్తాయి. ఆర్థికవేత్తల ఆలోచనలు వినూత్నంగా ఉండాలి. మహ్మద్‌ యూనిస్‌ ఆలోచన ఉపఖండంలో కొత్తమార్పులు తీసుకొచ్చింది. సమాజంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉంది. పేదరికంలో మగ్గుతున్న కొన్ని వర్గాలపై విస్తృతంగా చర్చించాలి. ఆర్థికవేత్తలు సమష్టిగా ఆలోచనలు చేసి సూచనలు ఇవ్వాలి. మానవ సమాజంలో కీలకమైన మలుపులో ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం పెంచుకునేలా మరిన్ని సంస్కరణలు రావాలి అని పేర్కొన్నారు.

Click here for Event Gallery