ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం : చంద్రబాబు

ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం : చంద్రబాబు

27-12-2017

ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కానుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఫైబర్‌ గ్రిడ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాబోయే రోజుల్లో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటి నుంచో అగ్రగామిగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు సీఈవో అయితే, తమిళనాడుకు చెందిన సుందర్‌ పిచ్చయ్‌ గూగుల్‌ సీఈవో అయ్యారు. టెక్నాలజీలో మనదేశం ఆదిపత్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది. ప్రపంచంలోని పది మంది సాంకేతిక నిపుణుల్లో నలుగురు భారతీయులు ఉంటే వారిలో ఒకరు మన రాష్ట్రానికి చెందిన వారు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్‌ ఇండియా నినాదాన్ని అందిపుచ్చుకున్నామన్నారు. రూ.5వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును కేవలం రూ.330 కోట్లతో పూర్తి చేశామని అన్నారు. ఫైబర్‌ నెట్‌తో రాష్ట్ర రూపురేఖలే మారిపోనున్నాయి. 2018 నాటికి కోటి వీడియో కాన్ఫరెన్స్‌ సిస్టమ్స్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

Click here for Event Gallery