రాష్ట్ర పండుగలా విశాఖ ఉత్సవ్‌ : గంటా

రాష్ట్ర పండుగలా విశాఖ ఉత్సవ్‌ : గంటా

27-12-2017

రాష్ట్ర పండుగలా విశాఖ ఉత్సవ్‌ : గంటా

విశాఖ ఉత్సవ్‌ను రాష్ట్ర పండుగలా ఘనంగా నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బీచ్‌ రోడ్డులోని విశాఖ ఉత్సవ్‌ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ నెల 28 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకను ఏపీ సభాపతి కోడెల, పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ప్రారంభిస్తారన్నారు. విశాఖ ఖ్యాతిని మరింత పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించినట్టు చెప్పారు. స్థానిక కళాకారుల్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్కేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. హీరో అఖిల్‌ నటించిన హలో, అల్లు శిరీష్‌ నటించిన ఒక్క క్షణం చిత్ర బృందాలు ఈ ఉత్సవ్‌లో పాల్గొని సందడి చేస్తాయని తెలిపారు.