దుర్గమ్మను దర్శించుకున్న సవిత కోవింద్‌

దుర్గమ్మను దర్శించుకున్న సవిత కోవింద్‌

27-12-2017

దుర్గమ్మను దర్శించుకున్న సవిత కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవిత కోవింద్‌ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం రాష్ట్రపతి దంపతులు అమరావతికి విచ్చేశారు. అమరావతిలో జరిగిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనగా ఆయన సతీమణి సవిత కోవింద్‌ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సవిత కోవింద్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమె వెంట రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపునేని రాజకుమారి తదితరులున్నారు.