తెలుగుదేశం లోకి నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి ?

తెలుగుదేశం లోకి నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి ?

11-04-2017

తెలుగుదేశం లోకి నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీ గూటికి చేరనున్నారు. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా దేశం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తల్లి అనారోగ్యంతో మరణించారు. మంత్రి అమర్‌నాథరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గిర్వాని చంద్రప్రకాష్‌ తదితరులు నల్లారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నల్లారి సోదరులను పార్టీలోకి ఆహ్వానించగా కిరణ్‌కుమార్‌ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అయితే వారి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి మాత్రం దేశం తీర్థం పుచ్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని దేశం పెద్దలకు కిషోర్‌ చెప్పినట్లు సమాచారం. త్వరలోనే భారీ జనసందోహంతో కిషోర్‌ దేశం తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దేశం పెద్దల నుంచి తనకు అవసరం అయిన హామీలు తీసుకున్న తరువాతే ఎప్పుడు పార్టీలో చేరతారనన విషయం ఆయన వెల్లడిస్తారని తెలుస్తోంది.