మరో మణిహారంగా ఏయూ కన్వెన్షన్ : ఉపరాష్ట్రపతి

మరో మణిహారంగా ఏయూ కన్వెన్షన్ : ఉపరాష్ట్రపతి

09-12-2017

మరో మణిహారంగా ఏయూ కన్వెన్షన్ : ఉపరాష్ట్రపతి

విశాఖకు మరో మణిహారంగా కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంటుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ సాగరతీరంలో రూ.15 కోట్లు వెచ్చించి ఆంధ్రవిశ్వవిద్యాలయం అధునాతనగా నిర్మించిన కన్వెన్షన్‌ భవనాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా కన్వెన్షన్‌ భవన ప్రారంభోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ భవనంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం వైభవంగా జరిగింది. 1800 మంది ఆశీనులై వేడుకను చూడగలిగేలా ఫంక్షన్‌ హాల్‌ను భారీగా నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ హరిబాబు, వీసీ ఆచార్య ఉమామహేశ్వరరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.