తెలుగుదేశంలోకి చేరిన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి

తెలుగుదేశంలోకి చేరిన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి

24-11-2017

తెలుగుదేశంలోకి చేరిన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, పీలేరు నియోజకవర్గ నాయకుడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి విజయవాడలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంకు దీటుగా పీలేరును తీర్చిదిద్దుతానన్నారు. గౌరవమైన, రాజకీయ సంప్రదాయాలు కలిగి, ప్రజల కోసం పనిచేసే నల్లారి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి రావడంతో పశ్చిమ తాలుకాలో పార్టీకి ఇక తిరుగుండదని అన్నారు.