పర్యాటక కేంద్రంగా విశాఖ : చంద్రబాబు

పర్యాటక కేంద్రంగా విశాఖ : చంద్రబాబు

08-04-2017

పర్యాటక కేంద్రంగా విశాఖ : చంద్రబాబు

విశాఖపట్నాన్ని విజ్ఞాన, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దునున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సింహాచలం గోశాలలో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దాంతోపాటు కల్యాణమండపం, సత్రాలు, డార్మిటరీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా తూర్పు నౌకదళ ప్రధాన అధికారితో కలిసి ఐఎన్‌ఎస్‌ డేగలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఓడల ద్వారా వచ్చే వ్యర్థ నీటి శుద్ధి, చేప పిల్లల ప్రాసెసింగ్‌, యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  విశాఖ అత్యంత అదమైన, అరుదైన నగరం అని అన్నారు. విశాఖలాంటి నగరం దేశంలో ఎక్కడా లేదన్నారు. విశాఖలో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఐటీ సంస్థల స్థాపనకు చాలామంది ముందుకొస్తున్నారని అన్నారు. పర్యాటకం, విద్య ఆరోగ్యం, ఐటీ, ఇండస్ట్రీ లాజిస్టిక్స్‌ తదితర కీలక రంగాల్లో రాష్ట్రం ముందుండాలని ఆయన ఆకాక్షించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా అభివృద్ధి పనులను దశలవారీగా చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.