పవన్‌ అనంతపురం జిల్లా నుంచి పోటీ
Sailaja Reddy Alluddu

పవన్‌ అనంతపురం జిల్లా నుంచి పోటీ

10-11-2017

పవన్‌ అనంతపురం జిల్లా నుంచి పోటీ

వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నిస్థానాల్లోనూ పోటీ చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలో పవన్‌కళ్యాణ్‌ మాటే శిలాశాసనమని తెలిపారు. పవన్‌ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారని అన్నారు. డిసెంబర్‌ 7 నుంచి పవన్‌ పూర్తి సమయం పార్టీకి కేటాయిస్తారన్నారు.