టీడీపీని ఢీకొట్టడమంటే కొండను ఢీకొన్నట్లే

టీడీపీని ఢీకొట్టడమంటే కొండను ఢీకొన్నట్లే

10-11-2017

టీడీపీని ఢీకొట్టడమంటే కొండను ఢీకొన్నట్లే

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీని ఢీకొట్టడమంటే కొండను ఢీకొట్టినట్టే అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. విశాఖపట్నంలో నగర టీడీపీ యువత విభాగం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా జగన్‌ మరోసారి పాదయాత్రలంటూ జనం మధ్యకి వెళ్తున్నారని పేర్కొన్నారు. మద్రాసుకు నీరు అందించేందుకు ఎన్‌టీఆర్‌ ఎలా కష్టపడ్డారో అదే విధంగా ఏపీకి నీరు అందించేందుకు చంద్రబాబు అంతే కష్టపడుతున్నారన్నారు. పట్టిసీమ ద్వారా పంటలకు సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని తెలిపారు. అందుకే ఆయన అపరభగీరథుడని కొనియాడారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన లేని కొందరు వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని అన్నారు.