ఏపీకి విద్యా రాజధానిగా రాజమహేంద్రవరం

ఏపీకి విద్యా రాజధానిగా రాజమహేంద్రవరం

06-11-2017

ఏపీకి విద్యా  రాజధానిగా రాజమహేంద్రవరం

ఆంధ్రప్రదేశ్‌కు విద్యా రాజధానిగా రాజమహేంద్రవరం కాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప రాష్ట్రపతి, గవర్నర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంద్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు నన్నయ్య యూనివర్సిటీకి గర్వకారణమైన రోజు అని అన్నారు. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఎన్‌టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ని 800 మంది కూర్చొనే విధంగా రూ.12 కోట్లు వెచ్చించి నిర్మించామని తెలిపారు. విదేశాల్లో చదువుకోనేందుకు పేద విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున స్కాలర్‌షిప్స్‌ ఇస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికమంది యువత భారతదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చూస్తున్న ఉత్సాహం చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అందరు కృషి చేసి ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు క్లాస్‌ రూంలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యను బోధించాలని, విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రాభివృద్ధి ఎంతగానో సహకరించారు. ఆయన ఇప్పుడు రాజకీయాలు చేయలేకపోవచ్చు గానీ, రాష్ట్రానికి అండగా మాత్రం ఉంటారు. ఓ సాధారణ వ్యక్తి పట్టుదలతో, అకుంఠిత దీక్షతో భారతదేశ రెండో అత్యున్నత పదవిని అధిష్టించడం తెలుగువారికే గర్వకారణం అన్నారు.