పాదయాత్రకు ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

పాదయాత్రకు ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

06-11-2017

పాదయాత్రకు ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో పలుచోట్ల సంఘీభావ యాత్రలు, ఆలయాల్లో పూజలు, అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. వాషింగ్‌టన్‌ డీసీలో పార్టీ నేతలు అక్కడి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బే ఏరియా, కాలిఫోర్నియాలోని బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్రకు సహాయ, సహకారాలు అందించేందుకు యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఒక ప్రణాళికను రూపొందించుకుని పాదయాత్ర విజయవంతానికి తమవంతు కృషి చేస్తుందని పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్‌ మధులిక, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆస్టిన్‌లో నిర్వహించిన ప్రదర్శనలో ఎన్‌ఆర్‌ఐ విభాగం డాక్టర్స్‌ లింగ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వాసుదేవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హ్యూస్టన్‌, టెక్సాస్‌లోనూ జగన్‌ పాదయాత్రకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.